ఖైరతాబాద్ క్యాండిడేట్ ఆమెనే
28-09-2026 | 01:04pm
ఖైరతాబాద్ ఉపఎన్నిక(Khairatabad by-election) నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఆసక్తికర గుసగుసలు మొదలయ్యాయి. అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతున్న వేళ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి(Vijaya Reddy) పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దానం నాగేందర్‌పై కాంగ్రెస్ నేత నుమాన్ మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. విజయారెడ్డిని బరిలో దింపితే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నట్లు సమాచారం. అయితే తుది అభ్యర్థిత్వంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: ఖైరతాబాద్‌లో నాకు ఎదురులేదు.. గెలుపు నాదే