దానం వర్సెస్ విజయా? ఖైరతాబాద్‌లో కొత్త చర్చ!
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉపఎన్నిక(Vijaya Reddy Khairatabad) నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్ అంశం ఆసక్తికరంగా మారింది. మాజీ కార్పొరేటర్, దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయారెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాల్లోకి పంపి, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
“దానం నాగేందర్ ఎంపీ(Danam Nagender MP) అభ్యర్థి.. నేను ఎమ్మెల్యే అభ్యర్థి” అని విజయా రెడ్డి వ్యాఖ్యానించారు. పీజేఆర్‌కు(PJR) ఖైరతాబాద్‌తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. పీజేఆర్ పేరు లేనిదే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ముందుకు వెళ్లదని ఆమె అన్నారు. పీజేఆర్ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక(Khairatabad Bypoll 2026) అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. దానం నాగేందర్, విజయా రెడ్డితో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇటీవల దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అనంతరం ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించడంతో ఉపఎన్నికకు మార్గం ఏర్పడింది. దీంతో నియోజకవర్గంలో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ(Telangana Politics) వర్గాల్లో చర్చ మరింత పెరిగింది. విజయా రెడ్డి వ్యాఖ్యలతో ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే తుది అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.