ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలి

08-09-2026 | 05:30am

నిర్మల్, సెప్టెంబర్ 7 ( విజయ క్రాంతి) వి నాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అ న్నారు.  సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి రానున్న వినాయక ఉత్సవాల నిర్వహణపై పీస్ కమిటీ సమావేశం నిర్వహిం చారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవే శ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, అన్ని మతాల పండుగలు సహోదర భావంతో, కలిసి మెలసి జరుపు కోవాలన్నారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుం డా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగ కుండా వైర్లను సరి చేస్తామని చెప్పారు. ఉత్స వ నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తమ వంతుగా తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు. మెరుగైన పారిశు ద్ధ్య పనులు చేపడతామన్నారు. 

ప్రశాంతంగా నిర్వహించాలి:ఎస్పి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి క్షేమంగా తెలిపా రు. వేడుకలకు తగిన పోలీసు బందోబస్తు ఏ ర్పాటు చేస్తామని తెలిపారు. సంబంధిత అ ధికార యంత్రాంగంతో పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో వినాయక ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేలా చూస్తామని తెలిపారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్‌ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, శాంతి కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు