వినాయకుడి లడ్డూ వేలం పాట

26-09-2026 | 10:57pm

రూ. 3 లక్షల 1 వేయి పలికిన వినాయకుని లడ్డు

ఘట్ కేసర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : పోచారం డివిజన్(Pocharam Division) పరిది, అన్నోజిగూడ లోని ది ఆనంద అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహించిన వినాయక నిమజ్జన(Vinayaka Immersion) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాట భక్తుల ఉత్సాహంతో విజయవంతంగా జరిగింది. వేలం పాట కార్యక్రమంలో అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. విఘ్నేశ్వరుని చేతిలో ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూ కు జరిగిన వేలం పాట లో అరవింద్ కుమార్  రూ. 3,01,000 లకు ఆ పవిత్రమైన లడ్డును దక్కించుకున్నారు.

కండువా, పంచె ను రూ.1లక్ష కు కె. వెంకటరాజేశ్వర్ రావు, మనీ గార్లాండ్ ను రూ. 1,50,000 కు కె. వెంకట రాజేశ్వరరావు, కలశం ను రూ. 1లక్ష కు జయంత్ సూర్య సాయిరామ్ దక్కించుకున్నారు. ఈకార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం. నిరంజన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఈ. భగవాన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సమాల నాగి రెడ్డితో పాటు కమిటీ సభ్యులు, ది ఆనంద కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు