ఎంకే యూత్ రాష్ట్ర కార్యదర్శిగా వొంటెల శరత

26-09-2026 | 11:10pm

కరీంనగర్ క్రైం , సెప్టెంబర్ 26(విజయక్రాంతి):- మున్నూరు కాపు యువజన విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా(State Organizing Secretary, Munnuru Kapu Youth Wing) వొంటెల శరత్ కుమార్ (Vontela Sharath Kumar)నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నీలం రాజ్ కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్ సూచన మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో మున్నూరు కాపు సంఘం బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు . తన నియామకానికి మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధ కృష్ణ కి కృతజ్ఞతలు తెలిపారు

మరిన్ని వార్తలు