ఓటు బ్యాంకు రాజకీయాలు సమంజసం కాదు
ముకరంపుర, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఓటు బ్యాంకు రాజకీయాల(Vote Bank Politics)కు తలొగ్గి గత, ప్రస్తుత ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినోత్సవం(Telangana Liberation Day)గా అధికారికంగా నిర్వహించడం లేదని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
బుధవారం కరీంనగర్ లో ప్రజా సంఘాల నాయకులతో సెప్టెంబర్ 17న ఆదికారికంగా తెలంగాణ విముక్తి దినోత్సవం నిర్వాహించాలని డిమాండ్ చేస్తూ సమావేషం నిర్వహించిన అనంతరం మీడియాతో పోలాడి రామారావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఆడ బిడ్డలు రోకలి బండలు, కారపు ముద్దలతో దైర్యంగా పోరాడి రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర మనదని అన్నారు.
నిజాం సైన్యం, రజాకార్లు గ్రామాలపై పడి ప్రజల హిందువుల ఆస్తులను లూటీ చేస్తూ, జాతీయ జెండా ఎగురవేసిన వారిని నిర్దా క్షిణంగా కాల్చి చంపుతూ మహిళలను చిత్రహింసలకు గురి చేశారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యంతో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని చెప్పారు. ఓటు బ్యాంక్ మత రాజకీయాలకు స్వస్తి పలికి తెలంగాణ ప్రజల మనోభావాలకనుగుణంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.