అసెంబ్లీ తర్వాత ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం

10-09-2026 | 04:30am
  1. ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమవుతాం 
  2. టీచర్ ఎమ్మెల్సీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ
  3. సీఎంను కలిసి వినతిపత్రం సమర్పణ

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఉద్యోగ జేఏసీ నేతలతో అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) అనంతరం ఓ సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలు పరిస్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చినట్లు టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి(Pingali Sripal Reddy) పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీలు శ్రీపాల్ రెడ్డి(Sripal Reddy), కోదండ రామ్(Kodandaram), అద్దంకి దయాకర్(Addanki Dayakar), పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్(Sunkari Bhiksham Goud) కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించినట్లు శ్రీపాల్ రెడ్డి తెలిపారు.

విద్యార్థుల యూనిఫామ్ నాణ్యత, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు గురించి చర్చించినట్లు తెలిపారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని కోరడంతో వెంటనే సీఎం స్పందిస్తూ జనరల్ అభ్యర్థులకు 32, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 37 సంవత్సరాలు పెంచుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను మరింత పటిష్టంగా అమలుపరుస్తామని, విద్యార్థి బ్యాంక్ ఖాతాలో ఫీజు డబ్బులు జమ అవుతాయ ని, విద్యార్థే స్వయంగా ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేశామని సీఎం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో పీఆర్టీయూ ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు