మందులు ఎక్కడ దాచాలి?

24-09-2026 | 05:30am
  1. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో గందరగోళ పరిస్థితి
  2. అదనంగా 3 నెలల బఫర్ స్టాక్ ఇండెంట్‌కు ఆదేశాలు 
  3. అవన్నీ ఎక్కడ దాచాలో తెలియని పరిస్థితి 
  4. తలలు పట్టుకున్న డిస్పెన్సరీల సిబ్బంది
  5. తెరవెనుక ‘మామూలు’ పర్వంపై అనుమానాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 2౩ (విజయక్రాంతి): ముక్కుతూ.. మూల్గుతూ నడు స్తున్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్(Employees' State Insurance) (ఈఎస్‌ఐ) వ్యవహారంలో ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు రోజుకో తలనొప్పికి దారితీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన లేకుండా జారీ చేస్తున్న ఆదేశాలు ఈఎస్‌ఐ డిస్పెన్సరీల(ESI Dispensary) సిబ్బంది గందరగోళానికి గురవుతున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకో వాల్సిన ఉన్నతాధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా మందుల ఇండెంట్ విషయంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీల సిబ్బంది తలలు పట్టుకునే దుస్థితి నెలకొంది. 

మూడు కాదు, ఆరు నెలల స్టాక్!

తాజాగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు కా వాల్సిన మందులు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు(Medicines, injections, tablets), ఇతర చికిత్సలకు అవసరమైన పరికరాలకు సంబంధించిన ఇండెంట్లు పెట్టుకో వాలంటూ ఈఎస్‌ఐ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. ఎ ప్పటిలాగే ఈ ఆదేశాలు వచ్చాయని అనుకున్నారు. అయితే అందులో 2026 ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు (క్యూ క్యూ అంటే ఆరు నెల ల కోసం మందుల ఇండెంట్ పంపించాలని ఆదేశాల్లో ఉండడం సిబ్బందిని ఆశ్చ ర్యానికి గురి చేస్తోంది.

సాధారణంగా ఇప్పటివరకు మూడు నెలల ఇండెంట్, అదనంగా మరో మూడు నెలల బఫర్ స్టాక్‌కు ఇండెంట్ పెట్టే అవకాశం ఇచ్చేవారు. అంటే మొత్తంగా ఆరు నెలలకే ఇండెంట్లు పంపిస్తారు. కానీ తాజా ఆదేశాల ప్రకారం ఆరు నెలలకు (క్యూ1, క్యూ 2) సంబంధించిన మందుల ఇండెంట్‌తోపాటు బఫర్ స్టాక్ కింద మరో మూడు నెలలకు సరిపడా మందులను కూడా దీనికి జత చేయాలి. మొత్తంగా 9 నెలల మందుల ఇండెంట్‌ను తయారుచేసి సెప్టె ంబర్ మొదటి వారంలోనే ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేయడంతో డిస్పెన్సరీల సిబ్బంది తలలు పట్టుకున్నారు.

ఇరుకిరుకు గదుల్లో భద్ర పర్చడం ఎలా?

ఇండెంట్ విషయం ఎలా ఉన్నా.. ఆ స్టాకు అంతా ఎలా భద్రపర్చాలన్నదే స మస్యగా మారుతోంది. నిజానికి ఇప్పటివరకు మూడు నెలల వాస్తవ మందుల తోపాటు బఫర్ స్టాకు కింద అదనంగా వచ్చే మరో మూడు నెలల సరుకు జాగ్రత్త చేసుకోవడానికే సరిపోయేంత స్థలం డిస్పెన్సరీల్లో లేదు. ఆ స్థాయిలో వసతులు కూడా లేవు. ఇప్పుడు అదనంగా మరో మూడు నెలల మందులను ఎక్కడ పెట్టుకోవాలి.. ఎలా భద్ర పర్చుకోవాలి.. ఎలా సాధ్యమవుతుందని డిస్పెన్స రీల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 

నిజానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో చాలా వరకు ప్రైవేటు భవనాలు, ఇండ్లల్లో నిర్వహిస్తున్నారు. వాటిల్లో సరిపోయేంత స్థలం లేక ఇరుగ్గా ఉంటున్నారు. డాక్టర్లు రోగులను పరీక్షించేందుకు ప్రత్యేక గదులు లేవు. ఓపీకి ప్రత్యేక రూం లేదు. ఇంజెక్షన్లు ఇచ్చేందుకు, ల్యాబ్‌లకు ప్రత్యేక గదులు లేవు. సరిపోయినన్ని ఫ్రిడ్జ్‌లు లేవు.

సిబ్బంది కూర్చునేందుకు కూడా ఇబ్బందిగా ఉం ది. పేషెంట్లకు టాయిలెట్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా వచ్చే స్టాకును దాచడానికే నానా కష్టాలు పడుతున్నారు. మెట్లు, కారిడార్, రూములు ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టాల్సి వస్తోంది. తాజాగా, మరో మూడు నెలల మందులు అదనం గా వస్తే ఎక్కడ పెట్టాలి.. ఎలా జాగ్రత్తగా చేయాలనేది ప్రశ్నగా మారింది. 

ఇది ‘మామూలు’ అంశమా?

క్షేత్రస్థాయిలో డిస్పెన్సరీల్లో నెలకొన్న పరిస్థితులపై ఎలాంటి అవగాహన ఉన్నా ఇప్పటికిప్పుడు ఆరు నెలల మందులను ఎవరూ కొనుగోలు చేయరు. కానీ ఇప్పటివరకు కేవలం మూడు నెలలకు ఒకసా రి మాత్రమే మందులు ఇండెంట్‌ను కోరే డైరెక్టరేట్ అకస్మాత్తుగా ఆరు నెలల ఇండెంట్‌ను కోరడంపై సర్వత్రా విస్మ యం వ్యక్తమవుతోంది. డైరెక్టరేట్‌లోని కొందరు అధికారులు ఈ మధ్య కాలంలో రిటైర్ అవుతున్నారని, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో ఏకంగా ఆరు నెలల ఇండెంట్‌కు ఆదేశాలిచ్చారనే చర్చ జరుగుతోంది.

మందుల కొనుగోలులో కంపెనీలు, ఏజన్సీల నుంచి ఉన్నతాధికారులకు, కొంద రు కీలక అధికారులకు కొంత కమీషన్ అందుతుందని ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకేసారి పెద్దమొత్తంలో దండుకోవచ్చనే ఉద్దేశంతో తాజా ఆదేశాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా దీన్ని అధికారుల ముందుచూపు అనుకోవాలో లేదా మామూళ్ల పర్వానికి కొత్త ద్వారాలు తెరిచారనుకోవాలో గానీ.. ఒకేసారి ౯ నెలల మందులు భద్రపరచడం ఎలా అని డిస్పెన్సరీల సిబ్బంది గందరగోళంలో మునిగిపోయారు.  

మరిన్ని వార్తలు