బోధన్ ‘మార్కెట్’ పీఠం ఎవరికి?

24-09-2026 | 05:15am

ఇద్దరు కాంగ్రెస్ బడా నేతల మధ్య పోటీ.. ఎవరికి దక్కేనోనని ఉత్కంఠ..?

  1. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే, పొద్దుటూరు సుదర్శన్‌రెడ్డికి తలనొప్పి..?

బోధన్, సెప్టెంబర్ 23  (విజయ క్రాంతి): బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్(Bodhan Market Committee Chairman) పీఠం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో హాట్టాపిక్గా మారింది. కీలకమైన ఈ పదవి కోసం పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలు(Senior leaders) పోటీ పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకే కుర్చీ కోసం ఇద్దరు హేమాహేమీలు కర్చీఫ్ వేయడంతో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు నాయకులు చాలాకాలంగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్లే కాకుండా, పార్టీలోని ‘పెద్దాయన’కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారేనన్న ప్రచారం జరుగుతోంది.

దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు తమకు ఉన్న రాజకీయ పరిచయాలు, పార్టీతో ఉన్న అనుబంధం, అనుచరుల బలాన్ని ముందుకు తెస్తూ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ కమిటీ చైర్మన్(Market Committee Chairman) పదవి వ్యవసాయ రంగం(agricultural sector)తో పాటు రైతులు, వ్యాపారులు, మార్కెట్ కార్యకలాపాలకు(Farmers, traders, market activities) సంబంధించి కీలకమైనదిగా ఉండటంతో ఈ పదవిపై కాంగ్రెస్ నేతల్లో ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది.

దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా ఇరువురు నేతలు తెరవెనుక ముమ్మరంగా పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. తమకు ఉన్న పరిచయాలు, పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుంటూ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే చివరికి పార్టీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుంది? ‘పెద్దాయన’ ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి? మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుంది? అన్న ప్రశ్నలు ప్రస్తుతం బోధన్ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. ఒకే పదవిపై ఇద్దరు సీనియర్ నేతలు కన్నేయడంతో పార్టీ కేడర్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.

పదవి కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరనే విషయంపై కూడా పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికారికంగా నిర్ణయం వెలువడే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుండగా.. చివరి నిమిషంలో ఎవరి పేరు తెరపైకి వస్తుందోనన్న ఆసక్తి బోధన్ రాజకీయాల్లో నెలకొంది.

మరిన్ని వార్తలు