బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యజ్ఞం
01-09-2025 | 12:00am
అర్మూర్, ఆగస్టు 31 (విజయ క్రాంతి) : గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బార్ అసోసియేషన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బార్ హాల్ నందు మహాగణపతి యజ్ఞము నిర్వహించడ మైనది.
ఈ యజ్ఞ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ దంపతులు యజ్ఞంలో కూర్చున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, న్యాయవాదులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






