చెట్టును ఢీకొన్న బైక్‌... యువకుడి మృతి

11-09-2026 | 08:46am

నర్సాపూర్‌: బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో(Narsapur forest) చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జక్కపల్లి గ్రామానికి చెందిన రాహుల్‌ గౌడ్‌(26) బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బైక్‌ సామగ్రి కోసం బుధవారం బాలానగర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాహుల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, అజాగ్రత్తగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి తండ్రి నగేష్‌గౌడ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు