విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
19-09-2026 | 11:28am
కల్వకుర్తి సెప్టెంబర్ 19: కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్‌లో మైసమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ షాక్(Electric shock)కు గురై అరవింద్ (25) అనే యువకుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం తర్నికల్(Tarnikal) గ్రామానికి చెందిన అరవింద్ పట్టణంలో ఉంటూ జీవనోపాధి పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి మైసమ్మ ఆలయం వద్ద విద్యుత్ , తీగలను సరిచేస్తుండగా అప్పటికే వర్షం కురవడంతో తేమ ఉండటంతో ప్రమాదవశాత్తు షాక్‌కు గురైనట్లు తెలిపారు. దీంతో అక్కడే పడిపోయిన అతన్ని తన మిత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు అరవింద్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.