బంద్ చేయాలని వినతి పత్రం

03-10-2026 | 06:18pm

బెల్ట్ షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ ఎస్సైకి వినతి పత్రం అందజేత

గ్రామంలోని అన్ని యూత్‌ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ

బెల్ట్‌ షాపులతో యువత, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన

వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ అధికారులకు విజ్ఞప్తి

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్‌ షాపుల(Illegal liquor outlets)ను బంద్‌ చేయాలని కోరుతూ గ్రామంలోని అన్ని యూత్‌ సంఘాల ప్రతినిధులు ఎక్సైజ్‌ ఎస్సై శిరీష(Excise Sub-Inspector Shirisha)కి శనివారం వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో బెల్ట్‌ షాపుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో మద్యం విక్రయాలు అందుబాటులో ఉండటం వల్ల యువత మద్యానికి అలవాటు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని యూత్‌ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. బెల్ట్‌ షాపుల వల్ల గ్రామంలో శాంతిభద్రతలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. వెంటనే ఎక్సైజ్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బెల్ట్‌ షాపులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని యూత్‌ సంఘాల ప్రతినిధులు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపై తనిఖీలు నిర్వహించి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు