4 September, 2026 | 7:35 AM

మెదక్‌కు కాంగ్రెస్ ద్రోహం

04-09-2026 | 06:00am
  1. సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారు
  2. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను నిలిపివేశారు
  3. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి లేకుంటే ఉద్యమం ఉధృతం 
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
  5. నర్సాపూర్ పరిధిలో కాళేశ్వరం కాలువలు, టన్నెల్ పనుల పరిశీలన
  6. కాలువ వద్ద సెల్ఫీ దిగి ముఖ్యమంత్రికి ఎక్స్‌లో పోస్టు

మెదక్/నర్సాపూర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్‌(Medak)కు కాంగ్రెస్(Congress) తీరని ద్రోహం చేసిందని, జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పగబట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ(BRS government) హయా ంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల(irrigation projects) పనులను కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత పూర్తి నిలిపివేసిందని ఆరోపించారు.

నర్సాపూర్ నియోజకవర్గ(Narsapur constituency) పరిధిలోని రెడ్డిపల్లి, మంతూరు గ్రామాల శివారులో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువలు(Kaleshwaram canals), టన్నెల్ పనులను(tunnel works) గురువారం స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Lakshma Reddy), ప్రజాప్రతినిధులతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. పనులు నిలిచిపోయిన కాలువ వద్ద సెల్ఫీ తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పంపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

కేసీ ఆర్ హయాంలో వేగంగా సాగిన కాళేశ్వరం కాలువ, టన్నెల్ పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిచిపోయా యని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ వైపు వచ్చే సుమారు 17 నుంచి 18 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో 85 శాతానికి పైగా పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వ మే పూర్తి చేసిందని తెలిపారు.

ఇంకా కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేస్తే నర్సాపూర్, ఆందోల్ నియోజకవర్గాల్లో సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం 18, 19 ప్యాకేజీల ద్వారా నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు సింగూరును గోదావరి జలాలతో నింపాలనే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని గుర్తు చేశారు. 

ఎండిపోయిన హల్దీ

రైతుల పట్ల, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖ రిని అవలంబిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్క చెరువు తవ్వ లేదని, ఒక్క చెక్‌డ్యామ్ కూడా నిర్మించలేదని విమర్శించారు. గతంలో వైసవిలో సైతం హల్దీ, మంజీరా నదుల్లో చెక్‌డ్యామ్‌లు మత్త డి దుంకేవని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రె స్ ప్రభుత్వ నిర్వాకం వల్ల వర్షాకాలంలోనూ హల్దీ వాగు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపాదిత ట న్నెల్ పూర్తయితే హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉం టుందన్నారు. సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోళ్, పటాన్ చెరు నియోజకవర్గాల్లోని 5 లక్షల ఎకరాలకు నీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని హరీశ్‌రావు ఆరోపించారు.

న ర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు కేసీఆర్ నిధులు ఇచ్చి సగానికి పై గా పూర్తి చేయిస్తే, ఈ ప్రభుత్వం ఆ పనులను కూడా ఆపేసి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి ందన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతా ల్లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ఒక్క మాట కూడా మాట్లాడకు ండా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పెం డింగ్ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆలస్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.  

నీరు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు

రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాళేశ్వరం కాలు వ పనుల దగ్గర దిగిన సెల్ఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పంపుతూ హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి గారూ.. నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు మీ చేతకాని పాలనకు, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. మెదక్ జిల్లా రైతులంటే మీకెందుకంత కక్ష?’ అని ప్రశ్నించారు. వెంటనే నిధులు ఇచ్చి పనులు ప్రారంభించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.