పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు

12-09-2026 | 05:51pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM Sri Zilla Parishad High School) నేరేడుచర్ల నందు పాఠశాల" ఎకో క్లబ్" "యంగ్ ఎర్త్ లీడర్స్" ఆధ్వర్యంలో వినాయక చతుర్థి పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ(environmental protection) అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను(Clay Ganesha idols) మాత్రమే పూజలలో వినియోగించాలని తద్వారా పర్యావరణమునకు, జలచరాలకు హాని కలుగకుండా చూడాలని కోరుతూ ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి ప్రతిమలను సదస్సులో పాల్గొన్న వారికి పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ ఎకో క్లబ్, యంగ్ ఎర్త్  లీడర్స్ విద్యార్థులు పర్యావరణహితమే పరమధర్మంగా భావిస్తూ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పండుగలనేకం పర్యావరణహితంతోనే ముడిపడి ఉన్నాయని అందరూ పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా పండుగలు జరుపుకోవాలని కోరారు. క్లబ్ మెంటర్ పీడీ ఎం యాదగిరి మాట్లాడుతూ గణపతి పూజలో ప్రకృతి పూజ ఇమిడి  ఉందన్నారు.

మరిన్ని వార్తలు