ముదిరాజ్ నేతల అరెస్ట్

11-09-2026 | 03:40pm

కుబీర్ (విజయక్రాంతి): ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ చైతన్య వేదిక(Mudiraj Chaitanya Vedika) ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలోకి మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆరోపించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అన్యాయమని మండిపడ్డారు. ముందస్తు అరెస్టయిన వారిలో ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు హరీష్ సుంకరి పోతన్న, బర్మ చిన్నయ్య, గంగాధర్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు