బాసర ట్రిపుల్ ఐటీకి నీటి గండం

26-10-2026 | 05:30am
  1. అధికారుల ముందు చూపు లేక అవస్థ 
  2. ఆన్‌లైన్ తరగతులకు శ్రీకారం 

నిర్మల్ అక్టోబర్ ౨౫ (విజయక్రాంతి): రా జీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాల యం(Rajiv Gandhi University of Knowledge Technologies) (ఆర్జీయూకేటీ) కి నీటి గండం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. 9,000 మంది చదువుకుంటున్న ఈ విశ్వవిద్యాలయం ఏదో ఒక సమస్యతో ప్రతినిత్యం వార్తల్లోకి ఎక్కుతుంది.

బాసర ట్రిపుల్ ఐటీ కి నీటి అవసరాలను తీర్చేందుకు 30 కోట్లతో నిర్మించిన చెరువుకు నేటి సరఫరా కాకపోవడమే ఈ దుస్థితికి కారణం. బాసర గోదా వరిలో పుష్కలంగా నీళ్లు ఉన్న ఆ నీళ్లను పం పింగ్ ల ద్వారా బాసర త్రిబుల్ ఐటీ చెరువుకు సరఫరా చేయడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యం బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నీటి ఖండానికి కారణమైంది.

అసలే ఎనీలో ప్రభా వం, ఆపై తీరమైన ఎండలు, మరోపక్క అడుగంటిన భూగర్భ జలాలు, బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల నేటి అవసరాలను ప్రస్తుతం తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. బాసర త్రిబుల్ ఐటీ లో మొత్తం తొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుతుండగా 15 లక్షల లీటర్ల నీటి అ వసరం ప్రతిరోజు వినియోగించవలసి ఉం టుంది.

ప్రస్తుతం 9 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా కావడంతో ఆరు లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడుతున్నట్టు అధికారులు చెప్తున్నా రు.విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 30 బోర్లు ఉన్న అందులో పది బోర్ల నుంచి మాత్రమే కొద్దిపాటి నీరు వస్తుందని రావడంలేదని కొందరు విద్యార్థులు చెప్తున్నారు.

దీంతో బాసర గోదావరి నదిపైనే బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల నీటి అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేక పంపుల ద్వారా ప్రతిరోజు బాసర త్రిబుల్ ఐటీ దగ్గర ఉన్న చెరువులోకి నీళ్లు సరఫరా చేసి అక్కడి నుండి త్రిబుల్ ఐటీ ప్రాంగణానికి సరఫరా చేస్తారు. మోటర్లు చెడిపోవడం, ఎండలు, భూగర్భ జలాలు తక్కువగా ఉండటంతో ఈ అకాడమీ ఇయర్లో చదువుకున్న విద్యార్థులకు నీటి అవసరాలను తీర్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. 

ఆన్‌లైైన్ తరగతులకు గ్రీన్ సిగ్నల్

బాసర ప్రాంగణంలో పియుసి-1 (PUC-I) నుండి ఈ-4 (E4) వరకు చదువుతున్న విద్యార్థులందరికీ దసరా సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. ఎల్ నినో (El Nino) ప్రభావంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల దృ ష్ట్యా, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం 2026-27 సెమిస్టర్-1కి సంబంధించిన సవరించిన అకాడమిక్ షెడ్యూ ల్ను విశ్వవిద్యాలయ యాజమాన్యం విడుదల చేసింది.

నూతన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26, 2026 నుండి పియుసి-1 నుండి ఈ-4 వరకు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతాయి. ఆన్లైన్ తరగతుల ద్వారా నవం బర్ 17, 2026 నాటికి సిలబస్ పూర్తి చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. క్యాంపస్కు విద్యార్థులు తిరిగి వచ్చే తేదీలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.

పియు సి-1, పియుసి-2 విద్యార్థులు నవంబర్ 10, 2026న క్యాంపస్కు రిపోర్ట్ చేయాల్సి ఉం టుంది. వీరికి నవంబర్ 10 నుండి నవంబర్ 18 వరకు క్యాంపస్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. అలాగే ఇంజినీరింగ్ (E1 నుండి E4) విద్యార్థులందరూ నవంబర్ 18, 2026న క్యాంపస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమకు కేటాయించిన తేదీల్లో క్యాం పస్కు రావలసిందిగా యాజమాన్యం స్పష్టం చేసింది.

విద్యార్థుల మిడ్-టర్మ్ , ఎండ్ సెమిస్టర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలన్నీ ఆఫ్ లైన్(ఫిజికల్) మోడ్లోనే నిర్వహించబడతాయి. పియుసి నుంచి ఇంజినీరింగ్ (PUC-I, PUC-II, E1, E2, E3, E4) అన్ని బ్యాచ్ల విద్యార్థులకు మిడ్-టర్మ్ (MT-2 & MT-3) ఆబ్జెక్టివ్ పరీక్షలు నవంబర్ 19 నుండి నవంబర్ 21, 2026 వరకు 3 రోజుల పాటు జరుగుతాయి.

ఎండ్ సెమిస్టర్ పరీక్షల విషయానికి వస్తే, E1 మరియు E2 బ్యాచ్లకు ప్రాక్టికల్ (ల్యాబ్) పరీక్షలు నవంబర్ 23 నుండి 28 వరకు, థియరీ పరీక్షలు నవంబర్ 29 నుండి డిసెంబర్ 06 వరకు ఉంటాయి. E3 మరియు E4 బ్యాచ్లకు థియరీ పరీక్షలు నవంబర్ 23 నుండి 29 వరకు, ప్రాక్టికల్ (ల్యాబ్) పరీక్షలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 03 వరకు నిర్వహిస్తారు.

పియుసి (P1, P2) విద్యార్థులకు థియరీ పరీక్షలు నవంబర్ 23 నుండి డిసెంబర్ 06, 2026 వరకు జరుగుతాయి. రిమిడియల్ పరీక్షలకు సంబంధించి B22, B23, B24 పియుసి బ్యాచ్లకు అక్టోబర్ 27 నుండి నవంబర్ 11 వరకు, ఇంజినీరింగ్ సెమిస్టర్-2 రిమిడియల్స్ నవంబర్ 10 నుండి 18 వరకు నిర్వహిస్తారు.

మిగిలిన పెండింగ్ మరియు P1, P2 రిమిడియల్ పరీక్షలు డిసెంబర్ 07, 2026 నుండి ప్రారం భమవుతాయి. విద్యార్థుల సంక్షేమం మరియు విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ చర్యలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించాలని, ఆన్లైన్ క్లాస్రూ మ్లోని నవీకరణలను కమం తప్పకుండా గమనిస్తూ షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యం సూచించింది.

మరిన్ని వార్తలు