సరస్వతి క్షేత్రంలో అవినీతి చీడ

26-10-2026 | 05:30am
  1. స్టోర్ రూమ్ లో సామాగ్రి పక్కదారి
  2. తాజాగా స్టోర్ ఇన్చార్జ్జి సస్పెన్షన్ 
  3. గతంలో ఇదే తరహా అక్రమాలు

నిర్మల్, అక్టోబర్ 25 ( విజయక్రాంతి) : చదువుల తల్లి సరస్వతి నిలయమైన బాసర అమ్మవారి ఆలయంలో(Basara Goddess Temple) అవినీతి చెద మరోసారి బట్టబయలైంది. బాసర అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం తయారు చేసే లడ్డు ప్రసాదం వస్తువులను పక్కదారి పట్టించిన ఓ ఉద్యోగి సస్పెన్షన్ గురి కావడం కానుకంగా తీగ చర్చకు దారితీస్తుంది.

దేవుడి ప్రసాదంలో అవినీతి చెద చోటు చేసుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతిస్తుంది. బాసర స్టోర్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ఇటీవలి బాసర లడ్డు పులిహోర సామాగ్రి పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు రావడంతో స్టోర్ రూమ్ లో స్టాక్ రిజిస్టర్ సామాగ్రిని తనిఖీ చేయగా సామాగ్రి మాయమైనట్టు రుజువయింది.

ఇందులో లడ్డుకు ఉపయోగించి నెయ్యి చక్కరి కిస్మిస్ ఇతర పదార్థాలు స్టాక్ రిజిస్టర్, పొంతన లేకపోవడంతో సదరు ఉద్యోగి కి నోటీసులు జారీ చేశారు. దేవాదాయ శాఖ అందించిన నోటీస్ కు వారం రోజుల్లో జవాబు చెప్పాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశించిన పొంతన లేని జవాబులు చెప్పడంతో అవినీతి జరిగినట్లు ధ్రువీకరించిన అధికారులు స్టోర్ ఇన్చార్జ్ రాజేందర్ ను ఆదివారం సస్పెండ్ చేశారు.

బాసర అమ్మవారి ఆలయలు అమ్మవారి ప్రసాదానికి సంబంధించిన కేంద్రంలోని అవినీతి అక్రమాలు సరుకుల పక్కదారి పట్టించడం క్షమించాలని నేరమని స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 

గతంలో కూడా ఇదే తరహా ఆక్రమాలకు 

బాసర అమ్మవారి ఆలయంలో అవినీతి అక్రమాలు కొత్తవి కావు. గతంలో కూడా ఆలయంలో వివిధ కేంద్రాల్లో వెదురు నిర్వహించే అధికారులే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దొరికిన సంగతి తెలిసిందే. అమ్మవారి ప్రసాద టికెట్లను రీసైకిల్ చేస్తూ రెండు సంవత్సరాల క్రితం అక్రమాలు చేయగా కొందరు ఫిర్యాదుతో ఈ విషయం బహిర్గతమైంది.

అమ్మవారి పులిహోర, లడ్డు విక్రయ కేంద్రాలు దేవదాయ శాఖ విక్రయించి టికెట్లలో కుంభకోణం జరిగినట్టు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అమ్మవారి లడ్డు కేంద్రం నుంచి తీసుకొచ్చిన పులిహోర లడ్డు లను వికరించి సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు అప్పట్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అధికారులు కొందరు సిబ్బందిపై వేటు వేయగా మరికొందరిని ఇతర ప్రదేశాలకు తరలించారు.

అంతకుముందు బాసర అమ్మవారి ఆలయంలో లడ్డు పులిహోర తయారీ కేంద్రంలో వినియోగించుకుని నెయ్యి చక్కెర కాజు కిస్మిస్ తదితర పదార్థాల అక్రమాలు కూడా వైర్రా పడ్డాయి. ఇందులో పెద్ద ఎత్తున ధనం దుర్విని కావడంతో విచారణ జరిగిన అధికారులు కొందరిపై చర్యలు వేసుకున్న సంగతి తెలిసింది.

నకిలీ రసీదులతో సామాగ్రి కొన్నట్టు రికార్డులు సృష్టించి అమ్మవారి ఆదాయాన్ని గండి కొట్టినట్టు ప్రచారం జరిగింది. రక్షణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసరలో అవినీతి అక్రమాల నిరంతరంగా వెల్లుల్లికి రావడం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆలయానికి ఎంతో ఆదాయం వస్తుంది.

ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇతర ఉత్సవాలు భక్తుల ప్రతి పెరిగి ఆదాయం పెరుగుతున్న అందులో పనిచేసే కొందరు ఉద్యోగులు మాత్రం వాటిని తమ సొంత వనరులుగా భావించి అక్రమాలకు పాల్పడడం పై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు