నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం

30-10-2026 | 03:01pm

నిర్మల్ అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ(Dr. B.R. Ambedkar Open University) అధ్యయన కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల తరగతులు నవంబర్ 1వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం చేయనున్నట్టు అధ్యయన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ యు. గంగాధర్  తెలిపారు.

ప్రతి ఆదివారం నిర్వహించే కౌన్సెలింగ్‌ తరగతుల్లో విద్యార్థులు చదువుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిష్ణాతులైన కౌన్సిలర్లు, అధ్యాపకులతో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దూరవిద్య విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు