డిసిసి ఉపాధ్యక్షునికి కాలనీవాసుల ఘన సన్మానం
సిసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తా: కౌన్సిలర్ రాజుర సత్యం
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ,డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం ,శైలజ దంపతులను 11వ వార్డు కాలనీవాసులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సుమారు మూడు కోట్ల రూపాయలతో కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కాలనీవాసులు సత్యం దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సత్యం మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సహకారంతో సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
వాటిని కాలనీలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న తీరుస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
కాలనీ కంటి వైద్య సహాయకురాలు చిత్రలతా రెడ్డిమల్ల మాట్లాడుతూ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణంతో మురుగునీరు, దోమల, పందుల బెడద తీరిందని అహర్నిశలు ప్రజల సేవ కోసం ముందుంటున్న కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు సీనియర్ జర్నలిస్టు, కంటి వైద్య సహాయకులు రెడ్డిమల్ల యేసుదాస్, మేస్త్రి చంద్రయ్య, సాగర్, క్రాంతి కుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటరమణ, అల్ హజ్, ప్రసన్న, సుమా, శంకరమ్మ, తదితరులు ఉన్నారు .