వన్ డే యూత్ రిట్రీట్ ని విజయవంతం చేయండి
21-10-2026 | 07:40pm
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ ఎస్ విజయ రావు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలో తలపెట్టిన క్రైస్తవ వన్డే యూత్ రిట్రీట్ ను విజయవంతం చేయాలని ఖానాపూర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆలయ పాస్టర్, రెవరెండ్ ఎస్ విజయ రావు పిలుపునిచ్చారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని సిఎస్ఐ ఆలయ ఆవరణలో జరిగే ఈ వన్డే రిట్రీట్ కు యువత వందలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అతిధి వక్తలుగా రెవరెండ్ ఏ అబ్రహం, విజయరావ్, హాజరవుతారని వారు పేర్కొన్నారు.