12వ వార్డులో అభివృద్ధి పనుల ప్రారంభం

26-11-2026 | 04:48pm

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) 12వ వార్డులో గురువారం సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులు మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ షోయబ్ హుస్సేన్ చేతుల మీదుగా ప్రారంభించారు. కాలనీలో అన్ని సిసి రోడ్లు, డ్రైనేజీలు సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తొడసం ఇందిరా, నాయకులు ఫహీం, కృష్ణంరాజు, ప్రేమ్, పర్వేజ్, షారు, నారాయణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు