బీజేపీ విధానాలతోనే ప్రమాదంలో రాజ్యాంగం
హనుమకొండ అర్బన్ (విజయక్రాంతి): సబ్బండ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రచించిన రాజ్యాంగాన్ని (Constitution) రక్షించుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. హనుమకొండలో సీపీఐ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని (Constitution Protection Day) నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బీజేపీ (BJP) అనుసరిస్తున్న విధానాలతోనే రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు ప్రజలంతా సమష్టిగా ఉద్యమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యుడు అదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్.ఎ. స్టాలిన్, బత్తిని సదానందం, కొట్టేపాక రవి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, గుంటి రాజేందర్, అలకుంట్ల యాకయ్య, పొనుగోటి రాముగోపాల్ చారి, కోడెపాక బాబు, మామునూరి దామోదర్, మాలోత్ మంగ, అలకుంట్ల మల్లయ్య, రోంటాల శ్యామ్, సముద్రాల అనిల్ తదితరులు పాల్గొన్నారు.