నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి అడ్లూరి

26-11-2026 | 04:21pm

ధర్మపురి, నవంబర్ 26 (విజయక్రాంతి): వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు అనుమాల మంజుల సోదరుడు భైరం రెడ్డన్న కుమార్తె సన్నిహిత, శివకుమార్ వివాహ వేడుకలకు గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను (Newlyweds) ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అయ్యప్ప ఆలయానికి రూ.5 లక్షల విరాళం

వెల్గటూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రహదారి పక్కన నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.5 లక్షల నగదు విరాళం (Donation) అందజేశారు. గతంలోనూ ఆలయ నిర్మాణానికి రూ.18 లక్షలు అందించారు. అలాగే నిత్య అన్నదానం (Annadanam) కోసం అయ్యప్ప స్వాములకు రూ.50 వేలతో పాటు అవసరమైన సరుకులను అందించారు. మంత్రి సహకారంపై అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గండ్ర శ్రీకాంత్ రావు, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గుండాటి సందీప్ రెడ్డి, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు