టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సతీష్ కుమార్ చారి

26-11-2026 | 04:09pm

బోధన్, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ విద్యార్థి విభాగం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా వడ్ల సతీష్ కుమార్ చారి నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు (Appointment Orders) జారీ చేసింది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వడ్ల సతీష్ కుమార్ చారి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ పట్టణ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానన్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను విద్యార్థులు, యువతలోకి తీసుకెళ్లడంతో పాటు పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

ఆయన నియామకం పట్ల బోధన్ పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకులు (Student Leaders) హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ చారికి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు