కేసముద్రంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కేసముద్రం (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే సెంటర్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి (Portrait) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నర్సింహారెడ్డి, జిల్లా నాయకుడు రామడుగు వెంకటాచారి, మండల ప్రధాన కార్యదర్శి బానోత్ రాము, మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి, లెంకలపల్లి శ్రీనివాస్, ముదిరెడ్డి మురళీధర్ రెడ్డి, జుజ్జూరు వీరభద్రచారి, యాకూబ్, సంపత్, యాకూబ్ రెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.