టీఎన్జీవో నేత మృతి
26-11-2026 | 06:12pm
నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా టీఎన్జీవో నేత(Nirmal TNGO Leader), టీఎన్జీవో అర్బన్ మాజీ అధ్యక్షులు చక్కెర శ్రీనివాస్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. నీటి పారుదల శాఖ(Irrigation Department) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న చక్కెర శ్రీనివాస్ అనారోగ్యంకి గురయ్యారు. ఆయన గురువారం మృతి చెందడంతో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెలుమల ప్రభాకర్,కుడాల రవికుమార్, టీఎన్జీవో నాయకులు నీటిపారుదల శాఖ అధికారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఎన్జీవో ఉద్యమాల్లో ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుకు తెచ్చుకున్నారు.