ఇందిరమ్మ బీమా భరోసాను సద్వినియోగం చేసుకోవాలి
26-11-2026 | 06:08pm
రాజాపూర్ నవంబర్ 26 : పేద కుటుంబాల జీవితాలకు ఆర్థిక భరోసానిచ్చే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Life Insurance Scheme) గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేశ్ అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ బీమా భరోసాను ఆన్లైన్లో నమోదు చేయించారు. అర్హులైన గ్రామ ప్రజలందరూ ఇందిరమ్మ బీమా భరోసాన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, ఉప సర్పంచ్ రామ్ చందర్,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.