హక్కుల హోరు నీలం సైన్యం జోరు

26-11-2026 | 06:11pm

పటాన్‌చెరు, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణ (Constitutional Protection), ప్రజాస్వామ్య విలువల (Democratic Values) కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా ర్యాలీ (Samvidhan Raksha Rally)కి పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి వందకు పైగా కార్లతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.

ట్యాంక్‌బండ్ లిబర్టీ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో నీలం మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం (Fraternity) విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు