ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చర్యలు
నిర్మల్ అక్టోబర్ 1 ( విజయక్రాంతి): ఎస్ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి(Telangana Chief Electoral Officer C. Sudarshan Reddy) ఆదేశించినట్టు కలెక్టర్ భవిష్ మిశ్రా వెల్లడించారు. ఎస్ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసినట్టు తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లను నోటీసులు అందుకోవడానికి లేదా అవసరమైన పత్రాలు సమర్పించడానికి కార్యాలయాలకు పిలవరాదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు.
ఇకపై సాధారణంగా ఓటర్లను విచారణ (హియరింగ్) కోసం కార్యాలయాలకు పిలవరాదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో విచారణ నిర్వహించాల్సి వస్తే ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.