ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బోధన్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి) : బసవతారకనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(Basavatarakanagar Government High School) 1999–2000 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల(SSC batch alumni) ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువులతో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేష్ బాబు, గోపీచంద్, నరేంద్రతో పాటు పూర్వ విద్యార్థులు నీలం కుమారస్వామి, మహేందర్, శంకరప్ప, త్రివేణి, భాగ్యలక్ష్మి, శశికళ, లావణ్య, లలిత, రాజు, రియానంద్, నరేష్, నాగూరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగేష్ బాబు మాట్లాడుతూ, తమ పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి, ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గోపీచంద్, నరేంద్రలు కూడా విద్యార్థులు తమను గుర్తుంచుకుని కుటుంబాలతో సహా రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు.