ఘనంగా కరాటే బెల్ట్, సర్టిఫికెట్ల ప్రదానం

11-10-2026 | 08:16pm

ఓకినావా స్టైల్ ఆఫ్ కరాటే  మార్షల్ ఆర్ట్స్ అకాడమీ

బోధన్, అక్టోబర్ 11 విజయ క్రాంతి : బోధన్ పట్టణం(Bodhan town) రాకాసి పేట్ లో గల  తిరుమల తిరుపతి దేవస్థానం  కల్యాణ మండపంలో ఆదివారం  ఓకినావా స్టైల్ ఆఫ్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ(Okinawa-style Karate Martial Arts Academy)   ఆధ్వర్యంలో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ షిహాన్ ఉష్కల  సాయిలు  మాస్టర్ పర్యవేక్షణలో కరాటే బెల్టులు, సర్టిఫికెట్ల(Karate belts and certificates) ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి బోధన్ పట్టణ ఆధ్యాత్మిక వేత్త , యోగ్ ధారణ ఫౌండేషన్(Yog Dharana Foundation) వ్యవస్థాపకుడు,బీజేపీ రాష్ట్ర దేవాదాయ శాఖ ధార్మిక విభాగం సలహాదారు  ఉదయ్ మహారాజ్  ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కరాటేలో ప్రతిభ కనబరిచి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ స్థాయిల్లో బెల్టులు ప్రదానం చేశారు. బ్లాక్ బెల్ట్ సాధించిన వారిలో ఉన్నారు .

అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్బంగా ఉదయ్ మహారాజ్  మాట్లాడుతూ కరాటే శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణించాలని సూచించారు. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ షిహాన్ యూ .సాయిలు మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన కరాటే శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బెల్టులు, సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులను తల్లిదండ్రులు, అకాడమీ నిర్వాహకులు అభినందించారు.

మరిన్ని వార్తలు