అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

16-10-2026 | 10:23pm

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ​

బోధన్, అక్టోబర్ 16(విజయక్రాంతి) : నిజామాబాద్(Nizamabad) నగరంలో అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి పనిలోనూ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(Dhanpal Suryanarayana) స్పష్టం చేశారు. నగర పరిధిలోని 23, 24, 6, మరియు 48వ డివిజన్లలో నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శ్రీకారం చుట్టి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని, ఆ నిధులతో ప్రస్తుతం అన్ని వార్డుల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.

చారిత్రక ఖిల్లా రామాలయ సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే రోప్‌వే ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్​ సిద్ధమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) నిజామాబాద్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గత మూడు సంవత్సరాలుగా సీఎంఆర్‌ఎఫ్, సీడీపీ నిధుల విడుదల కోసం ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ​ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో నగర మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి, సుమిత్ర కిషోర్, విజయ మల్లేష్ యాదవ్, ప్రసన్న శ్యామల సత్యపాల్​​ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు