లక్కారంలో ఘనంగా శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ముత్తారం, అక్టోబర్ 11(విజయక్రాంతి): ముత్తారం మండలం లక్కారం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.