సెంటీనరీ కాలనీలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

02-11-2026 | 03:21pm

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు

క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు

రామగిరి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) రామగిరి మండలంలోని సెంటీనరీ కాలనీలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బేగంపేటకు చెందిన తండ్రీకొడుకులు తూర్పాటి సమ్మయ్య (70), సాయిలు (45) ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మంథని మండలం పుట్టపాకకు చెందిన సిరిసెట్టి అశోక్‌ బైక్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సమ్మయ్య, సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు