వైభవంగా కోజాగర పౌర్ణమి వేడుకలు
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Shiva Temple) సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో కోజా గర పౌర్ణమి వేడుకలు(Kojagara Purnima Celebrated) వైభవంగా జరిగాయి, ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ శివాలయం, సాంబశివ దేవాలయం అర్చకులు వల్లకొండ మఠం రమేష్, పారు వెళ్ళ రమేష్ శర్మలు భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలలో చంద్రబింబాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి అన్నారు, కోజాగర పౌర్ణమి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాలతో తయారు చేసిన పాయసంలో చంద్రబింబాన్ని చూసి తరించారు.
ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా కోజాగార పౌర్ణమి సందర్భంగా పాయసంలో చంద్రగుప్తాన్ని చూడడంతో సకల దోషాలు తొలగిపోతాయని, స్వామివారి అనుగ్రహం కలుగుతుందని అన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే కోజాగర పౌర్ణమి వేల ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చంద్రబింబం పడిన పాయసాన్ని సేవిస్తే శుభం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, లింగమూర్తి, పళ్ళ సురేష్, రవి, అరుణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.