అనారోగ్యంతో బాధపడుతున్న అజయ్‌కు మంత్రి శ్రీధర్‌బాబు భరోసా

12-09-2026 | 06:46pm

చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు

ముత్తారం, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన శీలం అజయ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలిచారు. వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2,50,000ల ఎల్‌ఓసీ ను మంజూరు చేయించారు.

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంజూరైన ఎల్‌ఓసీని హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు శీలం అజయ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచినందుకు అజయ్ కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స భారంగా మారకుండా ప్రభుత్వం ద్వారా అందుతున్న సీఎంఆర్‌ఎఫ్ సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా మంత్రి శ్రీధర్ బాబు చొరవ చూపుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అజయ్ కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించడం పట్ల కుటుంబం సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు