సంధి మార్గమే సరైన మార్గం

12-09-2026 | 06:30pm

పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలి

మంథని సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

మంథని,(విజయక్రాంతి): సంధి మార్గమే సరైన మార్గమని పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా చేసుకోవచ్చని మంథని సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది(Manthani Senior Civil Judge Aparna Malladi) అన్నారు. శనివారం మంథని కోర్టు ప్రాంగణం(manthani court premises)లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం(National lok adalat program)లో సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది మాట్లాడుతూ.. కక్షిదారులు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా అనవసరమైన కాలయాపనను నివారించవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

కేసుల పరిష్కారానికి రాజీ మార్గం ఎంతో ఉపయోగకరమని, దీనివల్ల న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల భారం తగ్గడంతో పాటు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా విచారించి పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందని జడ్జి అపర్ణ మల్లాది పేర్కొన్నారు. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్ర సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అనురాధ, ఏపీపీ అర్ధకుమార్, ఏజీపీ ఆంజనేయులు, సీనియర్ న్యాయవాదులు రఘోత్తం రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు