సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడాలి

12-09-2026 | 07:12pm

◆ చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు

 సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): ​తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట(Telangana Armed Peasant Struggle) స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని ఉద్యమాలు నిర్మించాలని కొత్తగూడెం మేయర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మూడ్ గణేష్, రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా శనివారం సిపిఐ కొత్తగూడెం పట్టణ కౌన్సిల్ ఆధ్వర్యంలో 52వ డివిజన్ మేదర బస్తిలో వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

వారు మాట్లాడుతూ.. నాటి నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీపై ఎర్రజెండా అండతో వేలాది మంది ప్రాణాలర్పించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ,నాయకులు భూక్య శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు