అశేషజనావాహిని రాకతో పులకరించిన కనుగుట్ట గ్రామం
నెల రోజులపాటు కొనసాగిన అఖండ జ్యోతి.
జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన జనం
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామం(kanugutta village)లో ఆగస్టు 13న ప్రారంభమైన శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం(Sabarimata akhand jyoti program) సెప్టెంబర్ 12న నేటితో ముగిసిపోయింది. ప్రతిరోజు భజన కార్యక్రమాలతో పాటు మహాత్ముల ప్రవచనాలు గ్రామస్తుల కోలాటాలతో కొనసాగిన ఈ కార్యక్రమం శనివారం నాటితో ముగిసిపోయింది. అఖండ జ్యోతిని కనుగుట్ట గ్రామానికి చెందినశబరిమాత భక్తులు బాధాకరమైన హృదయాలతో అప్పగించడం జరిగింది. తమ ఇంటి లక్ష్మి మహారాష్ట్రలోని సాంగ్లీ గ్రామస్తులకు అప్పగిస్తున్నామన్న ఆవేదనతో ఆ గ్రామ సర్పంచ్ కు అందించారు.
కాగా కార్యక్రమానికి దాదాపు 20,000 మంది భక్తులు హాజరై అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సమేతంగా శబరిమాత పాదపూజ కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాజీ ఎంపీపీ సన్మానించగా ఆయన గ్రామ సర్పంచ్ ఆకుల రాజేందర్ అనితలను సన్మానించారు. అంతేగాక నిర్విరామంగా సేవలందించిన వారందరినీ సన్మానించడం జరిగింది కార్యక్రమంలో శబరిమత ఆశ్రమ అధ్యక్షులు భోజన్న తో పాటు భక్తులు పాల్గొన్నారు.