ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ వైర్ల సమస్యకు పరిష్కారం

11-10-2026 | 07:56pm

సుల్తానాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలోని బస్టాండ్‌ ప్రాంతంలో ప్రమాదకరంగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్‌ వైర్ల సమస్యకు(Issue with electrical wires) సర్పంచ్‌  ఉప్పు లక్ష్మి(Sarpanch Uppu Lakshmi ) చొరవతో  ఆదివారం పరిష్కారంలభించింది.బస్టాండ్‌ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్లు, ధాన్యం బస్తాలతో వెళ్లే హార్వెస్టర్ల రాకపోకలకు ఈ విద్యుత్‌ వైర్లు ప్రమాదకరంగా మారాయి.

ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్‌ ఉప్పు లక్ష్మి విద్యుత్‌ శాఖ అధికారులతో సంప్రదించి, 9.1 విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేయించి వైర్ల సమస్యను పరిష్కరించారు.దీంతో ప్రమాదం జరిగే అవకాశం తగ్గడంతో పాటు గ్రామస్తులు,వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. సమస్యనుపరిష్కరించేందుకు చొరవ చూపిన సర్పంచ్‌ ఉప్పు లక్ష్మితో పాటు విద్యుత్‌ శాఖ అధికారులకు గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు