బిజెపి పార్టీ నాయకులకు సన్మానం
రుద్రంగి అక్టోబర్ 16(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బిజెపి పార్టీ నాయకులకు(BJP party leaders) జిల్లా మరియు మండల కమిటీలో నూతనంగా పదవులు వచ్చిన సందర్బంగా మండల అధ్యక్షుడు కర్ణవేత్తుల వేణు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గా తాళ్లపెల్లి బాలకిషన్ రావు, ఎండోమెంట్ సెల్ మండల అధ్యక్షుడిగా బాసాని దయానందం,ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా బాధవత్ గంగాధర్,
ఎండోమెంట్ ఉపాధ్యక్షుడిగా తోకల పెద్ద గంగారాం ను నియమించగా మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.బిజెపి పార్టీ రాష్ట్ర నాయకత్వం మరియు జిల్లా నాయకత్వం తమ సేవలను గుర్తించి పార్టీ పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో,మండల ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్,అల్లూరి అశోక్ రెడ్డి, శీలం కుంటయ్య, గెంటే మల్లయ్య, బలగం శ్రీధర్, నేవూరి కిషన్,గసికంటి వెంకట్,పాల్గొన్నారు.