పూజం గోపాల్ రచించిన రెండు పుస్తకాల ఆవిష్కరణ
-‘సూర్యుడికి పురిటి నొప్పులు’, ‘కుంతలవో! శకుంతలవో!’ పుస్తకాలను ఆవిష్కరించిన ప్రముఖులు.
-కార్యక్రమానికి హాజరైన పర్యావరణవేత్తలు, సాహితీవేత్తలు, సామాజిక ఉద్యమకారులు
కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో బుధవారం రచయిత పూజం గోపాల్(Pujam Gopal) రచించిన ‘సూర్యుడికి పురిటి నొప్పులు’, ‘కుంతలవో! శకుంతలవో!’ అనే రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ, విశిష్ట అతిథిగా కుల నిర్మూలన పోరాట యోధుడు స్కైలాబ్ బాబు హాజరయ్యారు.
ఆత్మీయ అతిథిగా బహుభాషావేత్త నలిమెల భాస్కర్ పాల్గొన్నారు. అలాగే అన్నవరం దేవేందర్, సీసాసా అధ్యక్షుడు జానపాల శంకరయ్య, వాసరవేణి పరుశురామ్, శ్రీలత, కోడం కుమార్, తిరుపతి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.రచయిత పూజం గోపాల్ రచించిన ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో సాహిత్యాభిమానులు, ప్రముఖులు పాల్గొని రచయితకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో సాహిత్య వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు పుస్తక పఠనం, రచనా రంగాలపై ఆసక్తిని ప్రోత్సహించే వేదికగా నిలిచింది.