నీటి కష్టాలకు చెక్!

07-10-2026 | 11:45am

గంభీరావుపేట, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని 11వ వార్డులో బోరుబావి పాత మోటార్‌సెట్ చెడిపోవడంతో ఏర్పడిన నీటి సమస్యను సర్పంచ్ మల్లు గారి పద్మ నరసయ్యగౌడ్ వెంటనే పరిష్కరించారు.

సమస్యను వార్డు సభ్యుడు దేవసాని కృష్ణ సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన వారు కొత్త మోటార్‌సెట్‌(Motor Set)ను ఏర్పాటు చేయించారు. దీంతో నీటి సమస్య తీరడంతో వార్డు ప్రజలు సర్పంచ్‌(Sarpanch), వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడంతో నీటి సరఫరా(Water Supply) పునరుద్ధరించబడిందని స్థానికులు తెలిపారు.

మరిన్ని వార్తలు