ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

10-10-2026 | 08:08pm

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో

కిక్కిరిసిన ఊరు వాడ..

గంభీరావుపేట అక్టోబర్ 10 (విజయక్రాంతి ): బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే తెలంగాణ సంస్కృతికి(Telangana Culture) ప్రతిరూపకంగా నిలిచే బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) గంభీరావుపేట మండలంలో(Gambhiraopet Mandal)  శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పకృతిని దేవతగా కొలుస్తూ సాగే ఈ వేడుకలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి.

తిరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో తీరక్క పూలతో పూజించి మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతారు. బతుకమ్మ సందర్భంగా శనివారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాలలో ఊరు వాడల్లో బతుకమ్మలను పేర్చి ఆడి పాడుతూ సందడి చేశారు. దీంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు