ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

10-10-2026 | 09:13pm

ముకరంపుర,(విజయక్రాంతి): ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు(Best Teacher Award) అందుకున్న పాలోజు ఆంజనేయులును మార్కండేయ నగర్ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వెల్ఫేర్ అసోసియేషన్(Srimadvirat Pothuluri Veerabrahmendra Swamy Welfare Association) సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం(Viswabrahmana Viswakarma United Association) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాల చారి, సంఘం అధ్యక్షులు పాములపర్తి శ్రీనివాస చారి, కార్యదర్శి కలికోట శ్రీనివాస్, కోశాధికారి కలికోట శివప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, కాయితోజు ఆనందం, ముఖ్య సలహాదారులు రామస్వామి, ఖడార్ల వేణుగోపాల్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు