ముదిరాజ్ సింహగర్జన సభకు భారీగా తరలివెళ్లిన రుద్రంగి

26-09-2026 | 10:54pm

రుద్రంగి సెప్టెంబర్ 26(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండల ముదిరాజ్ సంఘం(Rudrangi Mandal Mudiraj Association) అధ్యక్షుడు బొండ్ల సత్యం ఆధ్వర్యంలో ముదిరాజ్ సింహగర్జన సభకు భారీగా సిరిసిల్లకు ముదిరాజ్ సంఘ సభ్యులు తరలివెళ్లారు.ఈ సందర్భంగా ముదిరాజ్ లు మాట్లాడుతూ. ముదిరాజులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా,విద్యాపరంగా,ఉద్యోగ పరంగా వెనకబడి ఉన్నారని అన్నారు. అలాగే వృత్తి నిర్వీర్యం కావడంతో ఉపాధి లేక ముదిరాజులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ముదిరాజ్ కులాన్ని బీసీ -డి నుండి బీసీ-ఎ లోకి మార్చాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.అలాగే ముదిరాజ్ కులస్తులకు(Mudiraj caste) మత్స్యకారులకు పెన్షన్ అమలు చేయాలని కోరారు.ముదిరాజ్ కులస్తులను ఓటు బ్యాంకు రాజకీయలకె వాడుకుంటున్నారని మండిపడ్డారు.30వ తేదీన జిలా కేంద్రానికి వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్ కులస్తుల డిమాండ్లను అమలు చేసి వెళ్లాలని అన్నారు.లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకు ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెబుతామని ఘాటుగా హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో,ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.....

మరిన్ని వార్తలు