శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి సేవా పల్లకి ఊరేగింపులో పాల్గొన్న SI మోతిరామ్
రుద్రంగి అక్టోబర్ 16(విజయక్రాంతి): నవరాత్రులు సందర్బంగా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Sri Lakshmi Narasimha Swamy of Rudrangi) సేవా పల్లకిని తొమ్మిది రోజులు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిప్పుతూ భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ కాగా గురువారం రోజు రాత్రి స్వామి వారిని స్థానిక SI మోతిరామ్ దర్శించుకొని స్వామివారి పల్లకి సేవా ను బుజాలపై మోసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి SI కి శాలువా కప్పి సన్మానించి స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా SI మోతిరామ్ మాట్లాడుతు,తొమ్మిది రోజులు స్వామివారు పల్లకిసేవాతో గ్రామంలోని భక్తులకు దర్శనం ఇవ్వడం మంచి ఆనవాయితీ అని అన్నారు.రానున్న దసరా బతుకమ్మ వేడుకలను భక్తులు సంతోషంగా శాంతి భద్రతల నడుమ ఘనంగా జరుపుకోవాలని కోరారు.