కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తే సహించేది లేదు

26-09-2026 | 09:31pm

కార్యకర్తలే పార్టీకి బలం: నిమ్మల తిరుపతి గౌడ్

గంభీరావుపేట, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మండలంలో వేర్వేరు గ్రూపులు ఏర్పరచి కాంగ్రెస్ పార్టీని(Congress Party) బలహీనపరిచే చర్యలు సహించబోమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్(Congress Mandal President Nimmala Tirupati Goud) హెచ్చరించారు. శనివారం గంభీరావుపేట మండల(Gambhiraopet Mandal) కేంద్రంలోని  దత్త సాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీ క్రమశిక్షణకు(Party discipline) విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. సస్పెండ్ అయిన వ్యక్తులతో కార్యక్రమాలు చేయడం అనుచితం అని పేర్కొన్నారు.

మండలంలో పార్టీ బలపడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతమైతే కార్యకర్తలతో కలిసి పీసీసీకి ఫిర్యాదు చేసి, అవసరమైతే ఢిల్లీకి వెళ్లడానికీ సిద్ధమని హెచ్చరించారు.ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ పంతులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజ్వీర్, నాయకులు నాగరాజుగౌడ్, ఎత్వర్, రేణుక, రామచంద్ర గౌడ్, అంజిరెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు