యాసంగికి నీటి గండం!
- ఎల్ నినో ఎఫెక్ట్.. వరికి ముప్పు
- 17 శాతం లోటు వర్షపాతం
- 18 జిల్లాల్లో తీవ్ర కరువు
- 300 మండలాల్లో కరువు పరిస్థితులు.. ప్రాథమికంగా గుర్తింపు
- వానాకాలంలోనే సుమారు 11 లక్షల ఎకరాల్లో తగ్గిన వరి సాగు
- మరింత లోతుల్లోకి భూగర్భ జలాలు
- యాసంగి సీజన్‌కు నీటి లభ్యతపై నీలినీడలు
అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తీవ్రరూపం దాలుస్తోంది. వానాకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురువక భూగర్భ జలాలు అడుగంటుతుండగా.. సాగు చేసిన పంటలు ఎం డిపోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం యాసంగి సాగుకు సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే వరి సాగు వి స్తర్ణం గణనీయంగా తగ్గగా.. రాబోయే సీజన్‌లో నీటి లభ్యత ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతేడాది వానాకాలం 67,33484 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 56,79,969 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 10,53,515 ఎకరాల్లో సాగు తగ్గింది. ఇప్పటికే వరి సాగు చేసిన ప్రాంతాల్లో నీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. చేతికందే సమంయలో నీరందకపోవడంతో చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయి. ప్రస్తుత నీటి వనరుల లభ్యంతను చూస్తుంటే యాసంగిలో వరి సాగు సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది.
కరువు మండలాలు మరిన్ని పెరిగే అవకాశం
వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలోని మొత్తం 614 మండలాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం 18 జిల్లాల పరిధిలోని 300 మండలాలను తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ నెలాఖరుకు కరువు మండలాల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భజలాలు, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి,
అక్టోబర్ చివరి నాటికి కరువు మండలాల తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అయితే ఈ వానాకాలంలో రాష్ట్రంలో 17శాతం లోటు వర్ష పాతం నమోదైనట్లు అధికారులు చెబతున్నారు. మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుండగా, 15 జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉన్న 121 రోజుల్లో 61 రోజులు మాత్రమే వర్షాలులు పడ్డాయి.
జోగులాంబగద్వాల జిల్లాలో 22 రోజులే వర్షం కురిసి 400 శాతం లోటు నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 327 మండలాల్లో వర్షాలు లేని సుదీర్ఘ బెట్ట వాతావరణం ఏర్పడినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. తీవ్ర దుర్భిక్షం, కరువు పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కరుపు అంచనా నివేదికను సమర్పించడంతో పాటు, సహాయక చర్యల కోసం కేంద్ర కేంద్ర ఆర్థిక ఆర్థిక సాయం కోరనున్నారు.
ఈ నేపథ్యంలో కరువుపై నియమించిన క్యాబినెట్ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా తక్షణ చర్యలు చేపట్టనున్నారు. నివేదిక వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశంతో పాటు రైతులు, నిపుణులతో సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులతో సమీక్ష నిర్వహించి, వర్షపాతం లోటు, భూగర్భ జలాలు, వ్యవసాయ నష్టాలు, తాగునీటి లభ్యత వంటి 12 ప్రమాణాలతో సమగ్ర కరువు నివేదికను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
మరోవైపు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్నేష నల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ అంచనాలు రాబోయే శీతాకాలంలో ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది వానాకాలంతో పాటు యాసంగి ఉత్పత్తులపైనా తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిరాశపర్చిన నైరుతి
నైరుతి రుతుపవనాలు ఈసారి తీవ్రంగా నిరాశపరిచాయి. జూన్- మధ్య దేశవ్యాప్తంగా 759.4 మి.మీ. వర్షపాతం మాత్రమే న మోదైంది. దీర్ఘకాలిక సగటు 868.6 మి.మీ.తో పోలిస్తే ఇది 87.4 శాతం మాత్రమే. 1901 తర్వా త నమోదైన అత్యల్ప రుతుపవనాల్లో ఇది 13వ స్థానం. కాగా, 2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వానాకాలం సాగు విస్తీర్ణం కూడా గత ఏడాదితో పో లిస్తే ఈసారి తగ్గడంతో ఆహార భద్రత కోణంలో కీలక పరిణామంగా మారింది.
రాష్ట్రంలో నైరుతి సీజన్‌లో 17 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్ర సగ టు ఐఎండీ ప్రమాణాల ప్రకారం సాధారణ కేటగిరీలోనే ఉన్న ప్పటికీ.. 33 జిల్లాల్లో 18 జిల్లాలు బోటు వర్షపాణాన్ని ఎదుర్కొ న్నాయి. దీంతో ఈ సీజన్‌లో వరి సాగు 56.79 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
సాధారణ సాగు 67.33 లక్షల ఎకరాలు ఉండగా 11 లక్షల ఎకరాల మేర తక్కువగా ఉంది. యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లనే సాగు చేస్తారు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న సన్న బియ్యం కొరత మరింత పె రుగు తుంది, ఆహార భద్రత అంటే వరితోపాటు పప్పుదాన్యాలు, నూనె గింజలు, చక్కెర, కూరగాయల ఉత్పత్తి వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో బియ్యం, పప్పులు, నూనె లు, కూరగాయల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది.
ఆహార నిల్వలపై ప్రభావం
వరిసాగు తగ్గితే ఆహార భద్రతలో కీలకమైన ఉచిత బియ్యం పంపిణీలో లోటు ఏర్పడనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఖరీఫ్ వరికోతలు ప్రారంభం కాగా, ప్రైవేటు వ్యా పారులు, మిల్లర్లు రైతుల వద్దకు వచ్చి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,461 ఉండగా, రూ.3,200 వరకు చెల్లిస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.80 వరకు చేరిన బియ్యం ధరలు.. సెంచరీ కొడతాయనే ఉ హాగానాలు వినిపిస్తున్నా యి. మరోవైపు ఉ ల్లిగడ్డల ధరలు కూడా కిలో రూ.50 నుంచి రూ.60 మధ్య ఉన్నాయి. ఇక కూరగాయ లు, ఇతర సరుకుల ధరలు సామాన్యులకు భారంగా పరిణమిస్తున్నాయి.